Thursday 9 January 2014

Search Engine Optimization ( SEO ) అంటే ఏమిటి? ( పాఠం-1 )

SEO అంటే Search Engine Optimization .
అసలు Search Engine అంటే ? సెర్చ్  అంటే వెతకడం . engine అంటే యంత్రం . వెతికే యంత్రం లాంటిదన్నమాట . SEO  గురించి తెలుసుకోవాలనుకోవారు . దాదాపు ఇంటర్నెట్ అవగాహన కలిగి ఉంటారు అనే ఉద్దేశ్యంతో కాస్త బేసిక్ విషయాలను వదిలేసి ముందుకు వెళతా . ప్రస్తుతం ఇంటర్నెట్ ఓపెన్ చేసేవారు ముందుగా బ్రౌజరు ఓపెన్ చేయగానే గూగుల్, యాహూ, బింగ్ లాంటి సైట్ లోకి ప్రవెశిస్తారు . లేదా ఆటోమేటిక్ గానే ఏదో ఒక సెర్చ్ పేజి వారి విండో లో కనపడుతుంది . వారికి కావాల్సిన పదాన్ని ఆయా  సెర్చ్ బాక్స్ లో టైపు చెస్తారు. ఉదాహరణకు క్రొత్తగా AAPSC పోస్టులు గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు సెర్చ్ బాక్స్ లో APPSC posts అనో APPSC  new posts  అనో టైపు చేస్తారు అనుకొండి . వారికి క్రింది పటంలో చూపబడినట్లు రిజల్ట్స్ వస్తాయి.


పై రిజల్ట్స్ లో యెల్లో మార్కింగ్ చేయబడినది గమనించండి. 2,700,000 రిజల్ట్స్ నుండి అని వచ్చింది . అంటే గూగుల్ తన డైరెక్టరీ నుండి అన్ని పేజి లను వెతికి పట్టింది. వాటిని పేజి కి 10 చొప్పున వివిధ పేజి లలో చూపుతుంది . క్రింది పటం  చూడండి .














ఇలా పేజి నంబర్స్ ఉంటాయి . మొదటి పేజిలో కనిపించే పది రిజల్ట్స్ మీద మాత్రమె వెతికేవారి దృష్టి ఉన్తున్ది. కానీ 2700000 వ రిజల్ట్ పై ఉండదు కదా !
మొదటగా వచ్చే ఆ 10 రిజట్ల్స్ పై దృష్టి పెట్టిన వీక్షకుడు ఏమి చేస్తాడు అనే విషయాన్ని రేపు తెలుసు కుందాం .
ఇప్పుడు క్రింది వీడియో చూడండి .



0 comments:

Post a Comment